ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Container Hit Power Pole in Jammu Junction Srikakulam District

ETV Bharat / videos

సినిమా స్టంట్​ను తలపించేలా - ఫ్లై ఓవర్​పై విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి గాలిలో వేలాడిన కంటెయినర్​ లారీ - కరెంట్​ పోల్​ను ఢీకొట్టిన కంటైనర్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 1:30 PM IST

Container Hit Power Pole in Jammu Junction Srikakulam District : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని జమ్ము జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ పై వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. కోల్ కత్తా నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఖాళీ కంటైనర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనటంతో కంటైనర్ ముందు భాగం వంతెన పైనుంచి కిందకు వేలాడుతూ మధ్యలో నిలిచింది. కంటైనర్ ఫ్లై ఓవర్ నుంచి కిందకు జారి పడకపోవటంతో అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై లారీ ప్రమాదాన్ని చూసిన ప్రయాణికులు నిర్ఘాంతపోయారు.

Lorry Hit Current Pole on Highway Near Narsannapet : కంటైనర్​ ఖాళీగానే వెళ్తున్న సమయంలో అదుపు తప్పి విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టి ముందు భాగం ధ్వంసమైంది. ఫ్లైఓవర్​పై అలాగే వేలాడుతోన్న కంటైయినర్​ను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన సమయంలో రోడ్డు పై పలు వాహనాలు ప్రయాణిస్తున్నాయి. అయినప్పటికీ కంటైనర్​ కింద పడకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details