Constitution Debate forum Meeting in Guntur: 'అనేక అంశాల్ని పరిశీలించాకే.. న్యాయమూర్తులు తీర్పులిస్తారు'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 3:28 PM IST
Constitution Debate forum Meeting in Guntur: రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు అన్నారు. గుంటూరులో రాజ్యాంగ చర్చా వేదిక సంస్థ ఆవిర్భావ సభకు... ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పట్ల పౌరులు బాధ్యతగా ఉండాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణ, చట్టాల అమలు సమాజానికి ఎంతో అవసరమని జస్టిస్ మన్మథరావు పేర్కొన్నారు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ సవరణను స్వాగతించాలని అభిప్రాయపడ్డారు.
అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను, గత కేసులతో పోల్చుకుంటున్నారన్నారని మన్మథరావు (Manmadha Rao) వెల్లడించారు. అయితే, కేసుకు సంబంధించి అనేక అంశాల్ని క్షుణంగా పరిశీలించిన తరువాతే న్యాయమూర్తులు తీర్పులిస్తారనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని జస్టిస్ మన్మథరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్, పలువురు న్యాయవాదులు, వైద్యులు, రాజ్యాంగ చర్చా వేదిక కార్యనిర్వహక వర్గం తదితరులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ తీరు తెన్నులపై వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు.