భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్‌లో భారీ ర్యాలీ - Visakhapatnam News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 7:03 PM IST
Constitution Day Celebrations in Visakhapatnam :భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. భీమ్ సేన ఆధ్వర్యంలో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది. భారత రాజ్యాంగం ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడానికి ఏటా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. వేల మందితో బీచ్ రోడ్లో ర్యాలీ చేస్తుంటామని భీమ్ సేన వ్యవస్థాపకుడు రవి సిద్దార్థ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, మహిళలు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
రవి సిద్దార్థ మాట్లాడుతూ.. గత ఎనిమిది సంవత్సరాలుగా రాజ్యాంగ దినోత్సవాన్ని విశాఖ బీచ్ రోడ్డులో జరుపుతున్నామని అన్నారు. ప్రస్తుతం తొమ్మిదో ఏటా అడుగుపెట్టి బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు మీద రన్ ఫర్ అంబేడ్కర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజ్యంగం అమలులోకి రాకముందు చాలా మంది ప్రజలకు హక్కులు లేవు.. అమలులోకి వచ్చాకే ప్రజలకు హక్కులు కలిగాయని చెప్పారు. ప్రజలు ఏవిధంగా పండుగలు జరుపుకుంటారో అదే విధంగా ఏటా.. రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు.