Congress Party Dharna at SVIMS Tirupati: నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలి..: స్విమ్స్ ఎదుట కాంగ్రెస్ ధర్నా - తిరుపతి తాజా వార్తలు
Congress Party Dharna at SVIMS Tirupati: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్విమ్స్ ఎదుట ధర్నాకు దిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. స్విమ్స్‌లో పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలని టీటీడీ కోరారు. అలాగే స్విమ్స్‌కు డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారిని కాకుండా ఓ డాక్టర్‌ను నియమించాలని చింతా మోహన్ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్విమ్స్‌లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేయాలని కోరారు. టీటీడీ ఆస్తుల విషయంలో తమకు సందేహాలు ఉన్నాయని ఆయన తెలిపారు. టీటీడీ తమ ఆస్తుల వివరాలను తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని చింతా మోహన్ కోరారు. అలాగే తిరుపతిలో ఉన్న జూపార్క్‌ను అక్కడి నుంచి వేరే చోటుకు తరలించి.. ఆ ప్రదేశంలో స్విమ్స్, టీటీడీ శాశ్వత ఉద్యోగులకు ఇళ్ల స్ధలాలను కేటాయించాలన్నారు.