Tulasi Reddy on Margadarsi: మార్గదర్శిపై ఎక్కడా లేని తప్పులు ఏపీలో కనిపించాయా?: తులసిరెడ్డి
Congress Leader Tulasi Reddy on Margadarsi: మార్గదర్శి సంస్థపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమని.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను మీడియా ఎత్తిచూపితే, మార్గదర్శిని వేధించడం జగన్ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమన్నారు. వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్గదర్శి విషయంలో... ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ఎందుకు సమస్య వచ్చిందని ప్రశ్నించారు.
అలాగే సీఎం జగన్ నవరత్నాలపై కూడా స్పందించారు. అవి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో హామీలకు సరిపోవని తేల్చిచెప్పారు. అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించిన తులసిరెడ్డి.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శాంతి లేదు, భద్రత లేదని ఆరోపించారు. సొంత చిన్నాన్నను హత్య చేస్తే కూడా తేల్చలేని పరిస్థితని, సొంత పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేశారంటే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రైతులకు ఆరు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, జగన్ నవరత్నాలకు తమ హామీతో పోలికే లేదన్నారు.