ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Congress_Leader_Tulasi_Reddy_Fires_On_Narendra_Modi_Over_Bifurcation

ETV Bharat / videos

Congress Leader Tulasi Reddy Fires On Narendra Modi Over Bifurcation: "విభజన సరిగ్గా లేకపోతే బీజేపీ ఎందుకు సహకరించింది"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 1:58 PM IST

Congress Leader Tulasi Reddy Fires On Narendra Modi Over Bifurcation : రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదని 9 సంవత్సరాల తర్వాత పార్లమెంట్​లో సోమవారం ప్రధాని మోదీ చెప్పడం అసందర్భం, అనవసరం, అర్థం లేదని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో తులసీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విభజన సరిగ్గా లేకపోతే బీజేపీ ఎందుకు సహకరించిందని, ఈ 9 సంవత్సరాలలో కాలంలో మోదీ సరి చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత అని తెలిపారు. ప్రత్యేక హోదాకు మాత్రం పంగనామాలు పెట్టిందని, బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి తిలోదకాలిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప స్టీల్ ప్లాంట్​కు స్వస్తి పలికిందని, దుగరాజపట్నం ఓడరేవు ఊసే లేదని, పోలవరం ప్రశ్నార్థకం అయిందని, విశాఖ, విజయవాడ మెట్రో రైళ్లు లేవని విశాఖ రైల్వే జోన్ లేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, చేయాల్సింది చేయకుండా పార్లమెంటులో అసందర్భ ప్రస్తావన చేయడం ప్రధాన మంత్రికి తగదని తులసి రెడ్డి హితువు పలికారు.

ABOUT THE AUTHOR

...view details