Congress Leader Thulasi Reddy on Sunna Vaddi Funds: 'పావు కోడికి.. ముప్పావు మసాలా'.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంపై తులసిరెడ్డి విమర్శలు - Congress Leader Thulasi Reddy on Sunna Vaddi Funds
Congress Leader Thulasi Reddy on Sunna Vaddi Funds: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరి.. పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్లు ఉందని కడపలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(APCC) మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు అందిస్తున్న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం గురించి అనేక పేపర్లలో, టీవీలలో అడ్వటైజ్మెంట్ ఇచ్చి.. కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని దుయ్యబట్టారు. ఇది కొత్త పథకం కాదని.. పాత పథకమని స్పష్టం చేశారు. ఇది 2012 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి 5 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ పథకం అమలు చేసిందని గుర్తు చేశారు. కానీ జగన్ ప్రభుత్వం 3 లక్షల రూపాయల వరకే అమలు చేస్తోందని విమర్శించారు. కోట్ల రూపాయలను ప్రచార కోసం ఖర్చు చేస్తూ.. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకాన్ని 7 లక్షల రూపాయల వరకు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తులసి రెడ్డి అన్నారు.