Chintha Mohan on Jagan: 'హత్యలు-ఆత్మహత్యలు, జైళ్లు-బెయిళ్లు'.. ఇదే జగన్ 4 ఏళ్ల పాలన: చింతా మోహన్ - మోదీపై ఆరోపణలు చేసిన చింతా మోహన్
Congress Ex MP Chintha Mohan: బీజేపీ 9 సంవత్సరాల పరిపాలనలో ఏం చేసిందని ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్నించారు. ప్రజల నాడి కర్ణాటక ఎన్నికల్లో తెలిసిపోయిందని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు కూడా రావని చింతా మోహన్ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. వైసీపీ 4 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి హత్యలు, సామాన్యుల ఆత్మహత్యలు, జైలు, బెయిల్ తప్ప సాధించింది ఏముందని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది,.. ఒకసారి న్యాయస్థానాలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. లక్షల కోట్లు బటన్ నొక్కి ఇచ్చామంటున్నారు, ఇచ్చే ఉండొచ్చు కానీ, ప్రతి దానిపై పన్నుల రూపంలో ప్రజలపై భారాలు వేసి ప్రజల సొమ్మును ప్రజలకు ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీ పెద్దలు సీఎం జగన్కు ప్రాణవాయువు అందిస్తున్నారని ఎద్దేవా చేశాడు. ప్రజల్లో మార్పు కనిపిస్తుంది.. కేంద్రం, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.