Clashes in YSRCP ఎంత అసమ్మతి అయితేనేం.. ఇంతలా కొట్టుకోవాలా! ఆముదాలవలసలో కర్రలతో దాడి చేసుకున్న వైసీపీ నేతలు! - ఆముదాలవలస నియోజకవర్గం
Conflict Between Ysrcp Leaders in Amadalavalasa: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. ఇటీవల పొందూరు మండలానికి చెందిన వైసీపీ నేత సువ్వారి గాంధీ తన వర్గీయుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అదే సమయంలో పార్టీకి చెందిన మరో నేత చింతాడ రవికుమార్ అనుచరులు గాంధీ వర్గీయులతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల వారు ఒకరిపై మరొకరు కర్రలతో త్రీవంగా దాడి చేసుకున్నారు. ఇరువర్గీయుల మధ్య మాటలు యుద్ధంతో చెలరేగింది చిలికి చిలికి గాలివానగా మారింది. వాట్సాప్ మెసేజ్ ద్వారా ముందుగా కవ్వింపు చర్యలు దిగడంతో ఇరు వర్గాలు రోడ్లపైకి వచ్చి ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఆమదాలవలస పట్టణానికి సమీపంలో ఉన్న కొర్లకోట జంక్షన్ వద్ద చింతాడ రవికుమార్ , సువ్వారి గాంధీ ఇద్దరు పక్క పక్కనే పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆముదాలవలసలో వైసీపీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో చర్చనీయాంశంగా మారింది. సంఘటన జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలనికి చేరుకొని లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.