ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Complaint_Against_CI

ETV Bharat / videos

Complaint on Tadipatri CI నాడు ఎస్సైగా ఉన్న తాడిపత్రి సీఐ వేధిస్తున్నాడంటూ.. ఎస్పీ, కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన మైనార్టీ కుటుంబం - AP Latest News

By

Published : Aug 7, 2023, 6:04 PM IST

Complaint on Tadipatri CI  అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ​పై ఓ మైనార్టీ కుటుంబం జిల్లా కలెక్టర్​కు, ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తాము మట్కా నిర్వహించనప్పటికీ ఆ పేరుతో తమను వేధిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. ముబీనా, తబుసుం అనే ఇద్దరు మహిళలు, వారి కుటుంబసభ్యులతో కలసి వచ్చి కలెక్టర్, ఎస్పీలకు తమ ఆవేదనను వినిపించారు. 2018లో రషీద్ అనే వ్యక్తి మట్కా నిర్వహిస్తుండగా.. అప్పట్లో ఎస్సైగా ఉన్న హామీద్ రైడ్ చేశారు. కానీ వారు తిరగబడి హామీద్​పై దాడి చేసి పోలీసు వాహనం కాల్చివేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అది మనసులో పెట్టుకుని హామీద్ ఇప్పుడు తాడిపత్రి సీఐగా వచ్చి తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మట్కా ఆడకపోయినప్పటికీ పెట్టీ కేసులు పెడుతున్నారన్నారు. మిమ్మల్ని వదిలేదని.. సీఐ హామీద్ బెదిరిస్తున్నట్టు వారు ఆరోపించారు. తమకు సీఐ నుంచి ప్రాణహాని ఉందని.. మమ్మల్ని రక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ ఒక ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాడిపత్రిలో మట్కా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దానిపై ఉక్కు పాదం మోపుతున్నామని.. తప్పు చేసిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్నట్టు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details