MP Vanga Geetha: అస్తులు రాయించుకున్నారంటూ... ఎంపీ వంగా గీతపై కలెక్టర్‌కు ఫిర్యాదు - వైరల్ న్యూస్
Complaint against Kakinada MP Vanga Geetha: కాకినాడ ఎంపీ వంగా గీత తమ ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారని ఎంపీ వదిన కళావతి ఆరోపించారు. తిరిగి వాటిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఎంపీ వదిన ఫిర్యాదు చేశారు. 2006లో తమ ఆస్తులు తన భర్త కృష్ణ కుమార్ తో బలవంతంగా రాయించుకున్నారని ఆమె ఆరోపించారు. 2010లో ఆయన చనిపోయారని కళావతి తెలిపారు. ఆ తర్వాత తమ ఇంట్లో దొంగతనం చేయించి బంగారు నగలు ఎత్తుకెళ్లారని ఆరోపించారు.
ఆస్తుల కోసం తమ పిల్లలు న్యాయస్థానంలో పోరాడుతుంటే చంపేస్తామని ఎంపీ వంగా గీత బెదిరిస్తున్నారని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ ఎక్కడ ఉన్నాడో కూడా తెలీడం లేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించ లేదని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ వంగా గీత దంపతులు, ఆమ సోదరి కుసుమ కుమారి దంపతులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లాకు కళావతి ఫిర్యాదు చేశారు.