ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Commercial Tax Employees Police Custody

ETV Bharat / videos

Employees Police Custody: వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల పోలీసు కస్టడీకి అనుమతి - వాణిజ్య శాఖ ఉద్యోగులను 4 రోజుల కస్టడీ

By

Published : Jun 6, 2023, 8:49 PM IST

Commercial Tax Employees Police Custody: ఇటీవల అరెస్టైన వాణిజ్య పన్నుల శాఖ నలుగురు ఉద్యోగులను పోలీసు కస్టడీకి అనుమతి ఇస్తూ రెండవ ఏసీఎంఎం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. నిందితులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని ఉత్తర్వుల్లో తెలిపింది. మహిళా ఉద్యోగిని విచారించే సమయంలో మహిళా పోలీసు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం నుంచి 9వ తేదీ వరకు పోలీసులు విచారణ జరపనున్నారు.

వాణిజ్య శాఖ ఉద్యోగులను 4 రోజుల కస్టడీ కోరుతూ విజయవాడ పటమట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం.. మూడు రోజుల కస్టడీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం చేకూర్చారనే ఆరోపణలతో పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఐదో నిందితుడిగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పేరును పోలీసులు చేర్చారు. ముందస్తు బెయిల్ కోరుతూ మంగళవారం విజయవాడ కోర్టులో సూర్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details