ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'కాఫీసాగు ప్రోత్సాహానికి చర్యలు తీసుకున్నాం' - సీఎస్ జవహర్ రెడ్డి కాఫీ పంట వార్తలు

🎬 Watch Now: Feature Video

Jawahar Reddy Agreement Coffee Crop In TATA Company

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 9:43 AM IST

Jawahar Reddy Agreement Coffee Crop In TATA Company: అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో.. సాగు చేస్తున్న అరకు కాఫీ పంటను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. సీఎస్‌ జవహర్​రెడ్డి స్పష్టం చేశారు. కాఫీ సాగు, మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. కాఫీ బోర్డు పంటను ఎలా కొనుగోలు చేస్తుందన్న దానిపై చర్చించారు. రాయలసీమలో కూడా కాఫీ పంటను వేసేందుకు.. స్థానికంగా ఒక మెగా ప్రోసెసింగ్ యూనిట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసేందుకు.. టాటా సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్‌ వెల్లడించారు.

రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీని మరింత పెద్దఎత్తున ప్రోత్సహించడం ఇంకా అధిక విస్తీర్ణంలో సాగుచేసేందుకు వీలుగా గిరిజన ప్రాంత రైతులను అన్నివిధాలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. రాయలసీమలో వేరుశెనగ, టమాటా ప్రొసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసిన విధంగానే.. కాఫీ పంటను ప్రొసెసింగ్ చేసేందుకు వీలుగా ఒక మెగా ప్రొసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు తక్షణం ఒక ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు.  

ABOUT THE AUTHOR

...view details