ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ ఉక్కు C.M.D అతుల్ భట్

ETV Bharat / videos

Vishaka Steel Plant : విశాఖ ఉక్కును మూడు నెలల్లో లాభాల్లోకి తెస్తాం! ప్రతిజ్ఞ చేసిన సీఎండీ,డైరక్టర్లు .. - visakhapatnam news today

By

Published : Aug 2, 2023, 9:13 AM IST

visakhapatnam steel plant : విశాఖ ఉక్కును మూడు నెలల్లో లాభాల్లోకి తీసుకురావడానికి సమష్టిగా కృషి చేస్తామని... C.M.D అతుల్ భట్ సహా, డైరెక్టర్ల నేతృత్వంలోని సిబ్బంది సమిష్టిగా.. టర్న్ అరౌండ్ ప్రతిజ్ఞ చేశారు. విశాఖ ఉక్కు సామర్థ్య వినియోగం పెంచడం, ఉక్కు ఉత్పత్తుల అవుట్‌పుట్‌ను 20% పెంచడంపై దృష్టి పెట్టాలని సిబ్బందిని సిఎండి అతుల్ భట్ కోరారు. బొగ్గు మిశ్రమాన్ని ఆప్టిమైజ్ చేయడమే కాకుండా, PCI (పల్వరైజ్డ్ కోల్ ఇంజెక్షన్) ని పెంచాలన్నారు. ఆక్సిజన్ ఎన్‌రిచ్‌మెంట్‌ను పెంపుదల చేయడం, స్క్రాప్ వినియోగాన్ని పెంచి, స్టీల్‌మెల్టింగ్ షాప్ కన్వర్టర్‌లలో ట్యాప్-టు-ట్యాప్ సమయం తగ్గించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మిల్లులలో రోలింగ్ గంటలను పెంచాలని, ఫెర్రో అల్లోయ్స్, రిఫ్రాక్టరీస్ వినియోగం తగ్గించడం వంటి ఖర్చులు తగ్గించే కార్యక్రమాలను అమలు చేయాలని ఈ సందర్భంగా సిఎండి ఉద్యోగులకు పిలుపు నిచ్చారు. వివిధ వ్యయ తగ్గింపు కార్యక్రమాల అమలుకు కట్టుబడి ఉండాలన్నారు. R.I.N.Lకు చెందిన మార్కెటింగ్, లైజన్, మైన్స్ విభాగాల సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

ABOUT THE AUTHOR

...view details