టీటీడీ ఉద్యోగుల ఇంటి పట్టాలపై సీఎం ఫొటో ఎందుకు ?: టీడీపీ, బీజేపీ శ్రేణులు - update news tirupati
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 5:54 PM IST
CM photo on the Rails of TTD Employees Houses :తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు మంజూరు చేసిన ఇంటి పట్టాలపై ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఉండడాన్ని టీడీపీ, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అలిపిరి కూడలిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధార్మిక సంస్థను రాజకీయ సంస్థగా మార్చేందుకు టీటీడీ అధికారులు, పాలక మండలి వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు. టీటీడీ ఈవో, ఛైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు
TTD Chairman, EO demand resignation : టీటీడీ ఉద్యోగులకు మంజూరు చేసిన ఇంటి పట్టాలపై జగన్ ఫొటోను ఏ విధంగా ముద్రిస్తారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. ఇంటి పట్టాలపై జగన్ ఫొటోను తొలగించాలని డిమాండ్ చేశారు. అలిపిరి కూడలిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. నియామ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీని రాజకీయ క్షేత్రంగా మారుస్తున్న ఛైర్మన్, ఈవో వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.