ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cm Jagans Visit To Nandyal And Kadapa District

ETV Bharat / videos

నంద్యాల, కడప జిల్లాల్లో ఈ నెల 30న సీఎం జగన్ పర్యటన - అవుకు సొరంగం నుంచి నీటి విడుదల - వైసీపీ వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 5:02 PM IST

Cm Jagans Visit To Nandyal And Kadapa District: ఈ నెల 30 తేదీన ముఖ్యమంత్రి జగన్ నంద్యాల, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా అవుకు రెండో టన్నెల్ ను సీఎం జాతికి అంకితం చేయనున్నారు. 30 తేదీ ఉదయం విజయవాడ నుంచి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి చేరుకుని అవుకు ప్రాజెక్టులోని రెండో సొరంగం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన అనంతరం కడప లోని పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు సీఎం హాజరు కానున్నారు. ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన సాయంత్రం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. 

సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్​కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.  గత కొన్ని రోజులుగా సీఎం పర్యటనల కోసం జనాలను తరలించడం.. సీఎం వెళ్తున్న దారిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం ద్వారా సామన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపట్ల బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ సారి సీఎం జగన్ రెండు జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details