ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan Yemmiganur Tour Arrangements

ETV Bharat / videos

CM Jagan Yemmiganur Tour Arrangements: సీఎం పర్యటన అంటేనే.. హడలిపోతున్న ప్రజలు - జగన్ వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 10:33 PM IST

CM Jagan Yemmiganur Tour Arrangements: రాష్ట్రంలో సీఎం పర్యటన అంటే సామాన్యులు  హడలెత్తే పరిస్థితులు నెలకొంటున్నాయి.  ఆయా ప్రాంతంలో సీఎం పర్యటన సందర్భంగా వీధి వ్యాపారులకు ఇక్కట్లు తప్పడం లేదు. సీఎం రాక కోసం ఏర్పాట్లలో భాగంగా అధికారులు భారీ బందో బస్తును ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లతో సామాన్య ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడటం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి  ముఖ్యమంత్రి జగన్ పర్యటనతో.. ఈసారి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులకు కష్టాలు వచ్చాయి. 

సీఎం జగన్ గురువారం ఎమ్మిగనూరు వెళ్లనున్నారు. సీఎం జగన్ ఆదోనిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి బస్సులో... వీవర్స్ కాలనీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయటంతో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, వీరశైవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ బల నిరూపణకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రుద్రగౌడ్ బ్యానర్లను ఎమ్మెల్యే వర్గీయులు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. 

ABOUT THE AUTHOR

...view details