ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM_Jagan_Will_Visit_YSR_District

ETV Bharat / videos

రెండు రోజుల పాటు అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన - CM Jagan Tour Schedule Tomorrow

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 9:59 AM IST

CM Jagan Will Visit YSR District and Annamayya District :సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి (Tadepalli) నివాసం నుంచి బయలుదేరి.. రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుని శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని, ఆ తర్వాత పులివెందుల శిల్పారామాన్ని ప్రారంభిస్తారు.

CM Jagan Tour Schedule Today : అనంతరం శ్రీ స్వామి నారాయణ్‌ గురుకుల్‌ స్కూల్‌కు శంకుస్ధాపన కార్యక్రమం, ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కళాశాలలు, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సెంట్రల్‌ టెస్టింగ్‌ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ ల్యాబ్‌లు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్‌ విజిట్, ఆ తర్వాత సీవీ సుబ్బారెడ్డి నివాసానికి సీఎం వెళతారు. అనంతరం ఇడుపులపాయలో జస చేస్తారు. 

CM Jagan Tour Schedule Tomorrow:శుక్రవారం ఉదయం 8గంటల 30నిమిషాలకు ఇడుపులపాయలోని Rkవ్యాలీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. తర్వాత ఎకో పార్క్ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి తాడేపల్లి నివాసానకి చేరుకుంటారు. సీఎం పర్యటింటే ప్రాంతాలను, ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా అధికారులు పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details