CM Jagan will Release Funds of YSR Vahana Mitra scheme: బటన్ నొక్కి వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకం నిధులు విడుదల చేయనున్న జగన్ - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 11:00 AM IST
CM Jagan will Release Funds of YSR Vahana Mitra scheme: వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకం నిధులను సీఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు. విజయవాడ విద్యాధర పురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు,ఎండీయూ ఆపరేటర్లకు ఆర్ధిక సాయం అందించనున్నారు. 2 లక్షల 75 వేల 931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ తదితర అవసరాల కోసం వీటిని ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉదయం 10.30 గంటలకు కంప్యూటర్ బటన్ నొక్క మొత్తం 275.93 కోట్ల నిధులను సీఎం విడుదల చేయనున్నారు. నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డ్రైవర్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు రూ. 10 వేలు విడుదల చేయనున్నారు.