ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cm_jagan_video_conference_in_district_collectors_and_authorities

ETV Bharat / videos

'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమాన్ని సచివాలయాల పరిధిలో నిర్వహించేలా చూడాలి: సీఎం జగన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 10:21 AM IST

CM Jagan Video Conference In District Collectors And Authorities: ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను పట్టుకోగలిగితే పీవీ సింధు, జ్యోతి సురేఖ, రాయుడు, శ్రీకాంత్‌, సాకేత్‌ వంటి అంతర్జాతీయ క్రీడాకారులను చూడగలుగుతామని అన్నారు. ఈ నెల 26న ప్రారంభించే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై తాడేపల్లిలోని  క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. 

ఈ పోటీలు ప్రారంభించే ముందు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మూడు కిలోమీటర్ల మేర మారథన్ నిర్వహించాలి. 47 రోజులపాటు ఈ క్రీడలను పండగలా నిర్వహించాలి. గ్రామస్థాయిలో, సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయటం అన్నది ఒక ప్రధానమైన కారణం అని సీఎం తెలిపారు. వీలైనంత వరకు అన్ని సచివాలయాల పరిధిలో నిర్వహించేలా చూడాలి. ప్రధానంగా గ్రామాల్లోని బాలికలను ఎక్కువగా ప్రోత్సాహించాలి అని జగన్ అధికారులను ఆదేశించారు. ఆడుదాం ఆంధ్ర కోసం దాదాపు 1.23 కోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆయన వెల్లడించారు. 34.19 లక్షల మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారని సీఎం అధికారులకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details