స్వచ్ఛతా ఉద్యమ్ యోజన - మురుగు శుద్ధి వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జగన్ - స్వచ్ఛతా ఉద్యమ్ యోజన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 2:00 PM IST
CM Jagan Started Sewage Treatment Vehicles: స్వచ్ఛతా ఉద్యమ్ యోజన పథకం కింద స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన మురుగు శుద్ధి వాహనాలను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. వాటిని వివిధ పురపాలికలు, కార్పొరేషన్లలోని సఫాయి కర్మచారీలకు పంపిణీ చేశారు. మొత్తం 100 మురుగు శుద్ధి యంత్రాలతో కూడిన వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జునతో పాటు.. పురపాలక, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛతా ఉద్యమ్ యోజన పథకాన్ని సఫాయి కర్మచారీలకు జీవనోపాధిని అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. దీని ద్వారా పారిశుద్ధ్య సంబంధిత పరికరాలు, వాహనాల సేకరణకు ఈ పథకం ద్వారా నిధులను నేషనల్ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమాకూరుస్తోంది. ఇది పారిశుద్ధ్య సంబంధిత వంటి వాటికోసం పట్టణ, స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయాన్ని సైతం అందిస్తోంది.