శ్రీకాకుళంలో వైఎస్సార్ సుజలధార పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 5:08 PM IST
CM Jagan Srikakulam District Visit Updates: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్-200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం మకరాంపురంలో రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.
CM YS jagan Comments: పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ‌్‌లపై విమర్శలు గుప్పించారు. ''చంద్రబాబు నాయుడు మూడుసార్లు సీఎంగా ఉన్నా ప్రజలకు ఏ మేలు చేయలేదు. ఎన్నికలొచ్చే సరికి పవన్‌తో జట్టు కడతారు. ఎన్నికలు ఎచ్చినా ప్రతిసారి చంద్రబాబు ఎత్తులు, పొత్తులు, జిత్తులు, కుయుక్తుల మీద ఆధారపడతారు. తెలంగాణలో మొన్న జరిగినా ఎన్నికల్లో పవన్‌కి డిపాజిట్లు కూడా రాలేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదు.'' అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు.