ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cm_jagan_review_on_covid_new_variant

ETV Bharat / videos

కొవిడ్‌ కొత్త వేరియంట్‌‌పై సీఎం జగన్ సమీక్ష- ఆందోళన అవసరం లేదన్న వైద్యాధికారులు - cm jagan review news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 5:13 PM IST

CM Jagan Review on Covid New Variant:కొవిడ్ కొత్త వేరియంట్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ముందస్తు చర్యల కోసం విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్థను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు కొత్త వేరియంట్‌పై విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బందికి కూడా అవగాహన కల్పించాలని సూచించారు.

Officials on Covid New Variant JN-1: కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై ప్రభుత్వం గానీ, ప్రజలు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు సీఎం జగన్‌కు వివరించారు. జేఎన్‌-1 వేరియంట్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కోలుకుంటున్నారని ముఖ్యమంత్రికి వెల్లడించారు. ''ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని తేలింది. జేఎన్‌-1కు వేగంగా విస్తరించే లక్షణం ఉంది. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్‌ శాంపిళ్లను విజయవాడ జినోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నాం. కొత్త వేరియంట్లు గుర్తించేందుకు ఈ పరీక్షలు దోహదం చేస్తాయి. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ ఉంచాం. ఆస్పత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్ధం చేస్తున్నాం. పీఎస్‌ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తెస్తున్నాం. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, డి-టైప్‌ సిలిండర్లు కూడా సిద్ధం చేశాం. 56,741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ వేరియంట్ వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు.'' అని వైద్యులు సీఎం జగన్‌‌కు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details