ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM_Jagan_Review_Meeting_with_Agriculture_Department_Officials

ETV Bharat / videos

CM Jagan Review Meeting with Agriculture Department Officials: వర్షాభావ పరిస్థితులు.. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం జగన్​ - CM Jagan comments on electricity demand

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 9:50 PM IST

Updated : Sep 1, 2023, 9:59 PM IST

 CM Jagan Review Meeting with Agriculture Department Officials: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ ప్రణాళికపై జగన్‌ శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ఇందులో జూన్‌-ఆగస్టు మధ్య 25 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. వాతావరణ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి నిల్వను పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నయ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. 

సలహా కమిటీలు, రైతుల డిమాండ్‌ మేరకు 80శాతం రాయితీపై 77 వేల క్వింటాళ్లకు పైగా విత్తనాలు సరఫరా చేసేందుకు సిద్ధం చేసినట్లు వివరించారు. బాధితుల్ని ఆదుకునేందుకు సహకరించే ఈ-క్రాప్‌ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్​ అధికారులకు సూచించారు. అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికపై కలెక్టర్ల నేతృత్వంలో రైతుల సలహా మండళ్లతో సమావేశం కావాలని ఆదేశించారు. ఏపీలో విద్యుత్‌ డిమాండ్‌, పంపిణీపై సమీక్షించిన జగన్‌.. యూనిట్‌ విద్యుత్‌ 7రూపాయల 52పైసల చొప్పున 966.09 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్లు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యుత్​ కొనుగోలు జరిపినట్లు తెలిపారు. 

Last Updated : Sep 1, 2023, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details