ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan Released YSR Kalyanamasthu Funds

ETV Bharat / videos

'కల్యాణమస్తు, షాదీ తోఫా' నిధులు విడుదల చేసిన సీఎం జగన్​ - సీఎం ఆన్ షాదీ తోఫా నిధులను విడుదల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 4:08 PM IST

CM Jagan Released YSR Kalyanamasthu Funds:కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్​ ఆఫీసులో సీఎం బటన్ నొక్కి 10 వేల 511 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 81.64 కోట్ల జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జులై నుంచి సెప్టెంబరు వరకు వివాహాలు చేసుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వధూవరులకు... కల్యాణమస్తు, షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని అందించినట్లు తెలిపింది. 2022 అక్టోబరు నుంచి ఇప్పటివరకూ 46వేల 62 జంటలకు రూ. 349 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు వివరించింది. 

 పదో తరగతి అర్హత ఎందుకంటే?: 2023 జూలై నుంచి సెప్టెంబరు వరకూ వివాహాలు చేసుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వధూవరులకు ముఖ్యమంత్రి జగన్ కల్యాణమస్తు (kalyanamastu), షాదీ తోఫా ఆర్ధిక సాయం నిధులు లబ్దిదారుల ఖాతాలకు విడుదల చేసినట్లు సీఎం వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్దిదారులకు ఆర్దిక సాయం విడుదల చేశారు. 10,511 మంది వధూవరులకు 81.64 కోట్ల ఆర్ధిక సాయం వారి తల్లుల ఖాతాకు జమ చేసినట్లు సీఎం పేర్కొన్నారు. 2022 అక్టోబరు నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకూ... 46,062 జంటలకు రూ. 349 కోట్ల మేర కల్యాణమస్తు, షాదీ తోఫా (Shaadi Tohfa) ఆర్ధికసాయం అందించామని సీఎం జగన్ స్పష్టం చేశారు. పథకం అమలు చేసేప్పుడు పదో తరగతి అర్హత ఎందుకని చాలా మంది ప్రశ్నించారని సీఎం గుర్తు చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసేయాలని చాలా మంది సలహాలు ఇచ్చారని తెలిపారు. అయితే, పదో తరగతి అర్హత కేవలం.. లబ్దిదారులు చదువుకోవాలని మాత్రమే నిబంధన పెట్టామని సీఎం స్పష్టం చేశారు. తద్వారా బాల్య వివాహాలు తగ్గుతాయని వెల్లడించారు. 

 విద్యార్ధుల్లో భాషపై పట్టు పెరుగుతోంది: ఓట్లు, ఎన్నికలు అనేవి రెండో ప్రాధాన్యంగా మాత్రమే ఉండాలన్నది తమ విధానమని సీఎం జగన్ (CM Jagan) వెల్లడించారు. అమ్మఒడి కార్యక్రమం వల్ల తల్లులు వారి పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారని వెల్లడించారు. ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్ పీ ప్యానళ్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. బైలింగ్వుల్ టెక్ట్స్ పుస్తకాల వల్ల విద్యార్ధుల్లో భాషపై పట్టు పెరుగుతోందని సీఎం వెల్లడించారు. ఇంటర్ వరకూ విద్యార్ధులను చదివించేందుకు అమ్మఒడి ఆదుకుంటోందన్నారు. ఆ తర్వాత విద్యాదీవెన, వసతి దీవెనెల ద్వారా ఉన్నత విద్య కూడా అందుతుందని స్పష్టం చేశారు. కల్యాణమస్తు ద్వారా సమాజంలో మార్పు జరుగుతోందని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details