ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cm_jagan_listened_digital_classes

ETV Bharat / videos

విద్యార్థులతో కలిసి డిజిటల్‌ పాఠాలు విన్న సీఎం జగన్ - CM Jagan Listened Digital Classes

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 5:01 PM IST

CM Jagan Listened Digital Classes With Students: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులతో కలిసి డిజిటల్‌ క్లాసులు విన్నారు. నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటన సీఎం చింతపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కాసేపు డిజిటల్‌ క్లాసులు విన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే తరగతి గదులు డిజిటలైజేషన్‌ చేశామని, ప్రభుత్వం అందిస్తోన్న ఈ ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ ఉంటుందని సీఎం తెలిపారు.

CM Jagan Distributed 4,34,185 Tabs: ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిర్వహించింది. ఈ సందర్భంగా చింతపల్లి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబులను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ట్యాబుల పంపిణీకి ముందు ఆయన అధికారులతో కలిసి చింతపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కాసేపు డిజిటల్‌ క్లాసులు విన్నారు.  

ABOUT THE AUTHOR

...view details