ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan Kurnool Tour

ETV Bharat / videos

CM Jagan Kurnool Tour: సీఎం పర్యటన.. ఈ సారి కెమెరాలపైన ఆంక్షలు

By

Published : Jun 1, 2023, 8:24 AM IST

Updated : Jun 1, 2023, 8:51 AM IST

CM Jagan Kurnool Tour: కర్నూలులో సీఎం పర్యటన.. ఈ సారి కెమెరాలపైనా ఆంక్షలు 


P0eoples Problems With CM Jagan Tours: ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలు అంటే చాలు ప్రజలు హడలిపోతున్నారు. ఆయన బహిరంగ సభలు, పర్యటనలకు అడ్డొస్తే.. ఏవైనా సరే(చెట్లు, డివైడర్​లు) అధికారులు తొలగిస్తున్నారు. ఆయన గాల్లో ప్రయాణించినా.. రోడ్డు మీద వెళ్లినా తిప్పలు తప్పడం లేదు. హోటళ్లు, దుకాణాలు, బంద్​ చేయడం.. ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టడం, చెట్లను నరికేయడం, చెత్తాచెదారం కనిపించకుండా రోడ్ల పక్కన అడ్డు తెరలు కట్టడం లాంటి పనులు చేస్తుంటారు.

సీఎం పర్యటనతో సామాన్యులు ఇలా అవస్థలు పడుతున్నారని.. మీడియా చూపిస్తుండటంతో, ఈ సారి అధికారులు జర్నలిస్టులపైనా ఆంక్షలకు సిద్దమైయ్యారు. సీఎం సభ హజరైయ్యే.. మీడియా ప్రతినిధుల్లో కెమెరాలకు అనుమతి లేదంటూ చెబుతున్నారు. కేవలం జర్నలిస్టులు మాత్రమే రావాలని పిలుపు ఇచ్చారు. దీంతో కెమెరామెన్లు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.  దీంతో సమాచారశాఖ అధికారుల తీరుపై మీడియా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. 

కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం..బటన్ నొక్కి -పీఎం కిసాన్ నిధులు లబ్దిదారుల ఖాతాలో జమ చేసే కార్యక్రమానికి  సీఎం హాజరు కానున్నారు.  ముందుగా ఉదయం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఓ వివాహానికి సీఎం జగన్ రానున్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పత్తికొండకు చేరుకుంటారు. సీఎం కార్యక్రమం కోసం పత్తికొండలో 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధించటంతో.. ప్రజలకు కష్టాలు తప్పటం లేదు. జర్నలిస్టులు నిరసన చేస్తున్నారు.

Last Updated : Jun 1, 2023, 8:51 AM IST

ABOUT THE AUTHOR

...view details