ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం జగన్ - CM Jagan YSR district visit news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 2:27 PM IST
CM Jagan Inaugurated RK Valley Police Station: వైయస్సార్ జిల్లా ఇడుపులపాయలో రూ.1.75 కోట్లతో నిర్మించిన ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. దీంతో పాటు జమ్మలమడుగులో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఇడుపులపాయలో.. వేముల మండల వైసీపీ నాయకులతో సమావేశమైన సీఎం జగన్.. రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ మరింత బలోపేతంగా ముందుకెళ్లేలా అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.
CM Jagan YSR District Visit Updates: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత రెండు రోజులుగా ఆయన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటి రోజు (గురువారం) పులివెందులలో పర్యటించిన ముఖ్యమంత్రి.. మున్సిపాలిటీ పరిధిలో రూ. 64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రెండో రోజు పర్యటనలో ఇడుపులపాయలో నిర్మించిన ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. ఆ తర్వాత ఎకో పార్కు వద్ద పార్టీ నాయకులు, ప్రజలతో సమావేశమయ్యారు.