CM Jagan Guntur Tour: రైతులకు తక్కువ అద్దెకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు: సీఎం
CM Jagan Distributed the Tractors: YSR యంత్ర సేవా పథకంలో భాగంగా.. రెండో విడత వాహనాలను ముఖ్యమంత్రి జగన్ పంపిణీ చేశారు. గుంటూరులో వరికోత యంత్రం ఎక్కి లాంఛంగా ప్రారంభంచిన జగన్.. ఆ తర్వాత లబ్దిదారుల వాహనాలకు జెండా ఊపారు. రైతులకు తక్కువ అద్దెకే ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు ఆందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రతి ఆర్బీకే పరిధిలో రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకే యంత్ర పనిముట్లు అందజేస్తామని స్పష్టం చేశారు. 491 క్లస్టర్ల స్థాయిల్లో కంబైన్డ్ హార్వెస్టర్లు అందజేస్తామన్నారు. అన్ని ఆర్బీకేల పరిధిలో యంత్రసేవా పథకం కింద వాహనాల పంపిణీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రైతులే సంఘాలుగా ఏర్పడి పథకానికి దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. 2వేల 562 ట్రాక్టర్లు, 100 కంబైన్డ్ హార్వెస్టర్లు, 13వేల 573 వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. రూ.125.48 కోట్ల రాయితీని రైతు సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు విడతల్లో యంత్రసేవా పథకం అమలు చేశామన్న సీఎం జగన్.. ఇంకా మిగిలి ఉంటే అక్టోబర్‌లో వారికి కూడా యంత్ర పరికరాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.