ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan Gives Great Importance to BC MP And MLAs

ETV Bharat / videos

బీసీలకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు: బీవై రామయ్య - బీసీ ఎంపీలు ఎమ్మెల్యేలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 10:32 PM IST

CM Jagan Gives Great Importance to BC MP And MLAs: రాజకీయంగా బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు బీవై రామయ్య స్పష్టం చేశారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయడం అన్యాయమని రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం తమతో కలిసి ఉన్న సంజయ్ కుమార్ పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు విచారిస్తున్నామని బీవై రామయ్య తెలిపారు. ఎప్పుడులేని విధంగా బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కేటాయిస్తుందని పేర్కొన్నారు. సంజీవ్ కుమార్ బీసీలకు వైసీపీలో న్యాయం జరగడం లేదని చెప్పడం సరికాదని రామయ్య అన్నారు. ఇప్పటికైనా సంజీవ్ కుమార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరిగి పార్టీలో కొనసాగాలని ఆయన కోరారు.

బుధవారం అభ్యర్థులను సీఎం ప్రకటించగానే సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. బీసీలకు సీట్లు కేటాయించాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయం తెలియకపోయినా ఒక డాక్టర్ అని తెలిసినా ఎంపీని చేశారు. సంజీవ్ కుమార్ ఎప్పుడు పార్టీకి పనిచేసింది లేదు. సంజీవ్ కుమార్ పార్టీని విడిచి వెళ్లటం అనేది బాధాకరమైన విషయం. సామాజిక సమీకరణాల దృష్ట్యా సీఎం ముందు నుంచి సీట్ల మార్పు ఉంటుందని అందరికీ చెప్పారు. -బీవై రామయ్య, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details