ఆంధ్రప్రదేశ్

andhra pradesh

P Gannavaram YCP MLA Kondeti Chittibabu

ETV Bharat / videos

చిట్టిబాబుకు సీటు ఇవ్వకపోతే ఒప్పుకోం - సీఎం దగ్గరే తెల్చుకుంటామన్న కార్యకర్తలు - CM Jagan denied ticket to MLA s

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 10:52 PM IST

P Gannavaram YCP MLA Kondeti Chittibabu: ఇంకా ఎన్నికల కోడ్​ కూయకముందే వైసీపీలో అసమ్మతి రాగం మెుదలైంది. గత కొన్ని రోజులుగా వైసీపీకి చెందిన  పలువురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటు నిరాకరిస్తున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు టిక్కట్టు రాదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పి.గన్నవరంలోని చిట్టిబాబు ఇంటి వద్దకు చేరుకున్న వైసీపీ నాయకులు, చిట్టిబాబు అభిమానులు అధిష్ఠానం నిర్ణయాన్ని తప్పుపట్టారు. 

ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వైసీపీకి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. చిట్టిబాబును కాదని ఇప్పుడు ఎవరో కొత్త వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఎమ్మెల్యే మార్పును తాము ఒప్పుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చిట్టిబాబును కాదని మరొకరికి టిక్కెట్ ఇస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన అభిమానులు పేర్కొన్నారు. అధిష్ఠానంతో అమీతుమీ తేల్చుకుంటామన్న నాయకులు చిట్టిబాబు ఇంటి నుంచి తాడేపల్లిలోని జగన్ నివాసానికి బయలుదేరారు. 

ABOUT THE AUTHOR

...view details