ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cm_jagan_delhi_tour

ETV Bharat / videos

CM Jagan Delhi Tour ఒక్కొక్కరుగా హస్తినకు.. సీఎం దిల్లీ పర్యటనలో ఏం జరిగేనో..! - Janasena support for TDP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 12:37 PM IST

CM Jagan Delhi tour : సీఎం జగన్‌ ఇవాళ దిల్లీకి బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక విమానంలో హస్తినకు పయనమయ్యారు. ఉదయం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి దిల్లీ వెళ్లగా నిన్న ఉదయం విజయసాయిరెడ్డి, రాత్రి సీఎస్ జవహర్ రెడ్డి తరలివెళ్లారు. తాజాగా సీఎం వెంట ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురు దిల్లీ వెళ్లారు. సీఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాదం పై నిర్వహించే సమీక్షకు హాజరు కావడంతో పాటు.. పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలవనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలు ప్రభుత్వాన్ని ఒంటరిని చేసిన పరిస్థితులు.. మరోవైపు ఎన్డీఏ భాగస్వామి పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటన వేళ జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని పెంచుతోంది.

 టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న పలు రాజకీయ పక్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు.. ముమ్మాటికీ రాజకీయ కక్షలో భాగమేనని ముక్తకంఠంతో చాటుతున్నాయి. ఈ క్రమంలో సీపీఐ, సీపీఎం చంద్రబాబుకు మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్న తరుణంలో సీఎం దిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

ABOUT THE AUTHOR

...view details