ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan called everyone come to unveiling Ambedkar statue

ETV Bharat / videos

19న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ - ప్రజలంతా కదలి రావాలి: సీఎం జగన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2024, 10:22 PM IST

 CM Jagan Called Everyone Come to Unveiling Ambedkar statue: విజయవాడలో ఏర్పాటు చేసుకున్న, అంబేడ్కర్ మహా శిల్పం మన రాష్ట్రానికే కాకుండా, దేశానికే తలమానికమని సీఎం జగన్ అన్నారు. ఇది, “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’! ఇది “సామాజిక న్యాయ’ మహా శిల్పమని సీఎం కొనియాడారు. ఈ నెల 19న విజయవాడలోని చారిత్రక, స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ గారి విగ్రహమని సీఎం సందేశంలో తెలిపారు. మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం, ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా, దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. 

 అణగారిన వర్గాలకు చదువులు, దగ్గరగా తీసుకు వెళ్ళిన మహనీయుడు అంబేడ్కర్ అని సీఎం అన్నారు. అంటరాని తనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన మహానుభావుడన్నారు. సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపమన్నారు. ఇప్పుడు విజయవాడలో, ఆవిష్కరిస్తున్న మహా శిల్పం, మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటం మాత్రమే కాకుండా, చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తి ఇస్తుందన్నారు. ఇది పెత్తందారీ భావాలమీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు, నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నట్లు సీఎం జగన్  తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, 19వ తేదీన అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ కోరారు. 

ABOUT THE AUTHOR

...view details