తిరువూరు అధికార వైసీపీలో వర్గ విభేదాలు.. కౌన్సిల్ సమావేశానికి కౌన్సిలర్లు గైర్హాజరు - ఏపీ తాజా వార్తలు
Class War In YSRCP at Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని అధికార వైసీపీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. అధికార మార్పిడి వల్ల వైసీపీలోని వర్గ విభేదాలు వెలుగులోకి వచ్చింది. పురపాలక సంఘం సమావేశానికి కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరుకాకపోవటంతో వర్గపోరు స్పష్టమవుతోంది. తిరువూరు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి రెండేళ్ల ఒప్పందం అమలు చేయకపోవటంతో అధికార పార్టీ సభ్యులు కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు. మొత్తం 17 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా.. వారిలో చైర్ పర్సన్‌తో కలిపి ఎనిమిది మంది సభ్యులు మాత్రమే కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. వారి గైర్హాజరుతో కోరం పూర్తి కాలేదు. దీంతో చైర్ పర్సన్ గత్తం కస్తూరిబాయి సమావేశాన్ని వాయిదా వేశారు. సమావేశం వాయిదాపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార వైసీపీలోని వర్గ విభేదాలతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. పలు రకాల సమస్యలతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్లోర్ లీడర్ షేక్ అబ్దుల్ హూస్సేన్ విమర్శించారు. అసలు పరిపాలనను పట్టించుకున్న వారే లేరని మండిపడ్డారు.