ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Class_War_Between_YSRCP_Leaders

ETV Bharat / videos

రోడ్డెక్కిన వైఎస్సార్సీపీ నేతల వర్గవిభేదాలు - విజయసాయిరెడ్డి కారును చుట్టుముట్టిన శ్రేణులు - వైసీపీ నేతల మధ్య పోరు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 12:20 PM IST

Class War Between YSRCP Leaders :  తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో అధికార వైఎస్సార్సీపీ నేతల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. నెల్లూరు జిల్లా కోవూరులో సామాజిక సాధికార యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఎదుటే రెండు వర్గాలుగా చీలి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గూడూరు వద్ద ఆయన వాహనాన్ని ఎమ్మెల్యే సంజీవయ్య (MLA Sanjeevaiah) వర్గీయులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే వ్యతిరేక వ‌ర్గీయులు అక్కడకు చేరుకున్నారు. సంజీవయ్య వద్దే వద్దు అంటూ కొందరు, కావాలంటూ మరికొందరు ఆయన్ను చుట్టుముట్టారు.

Sullurpeta Constituency  YSRCP Leaders Class War : ఇరు వర్గాల పరస్పర వ్యతిరేక నినాదాలతో అక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. బలప్రదర్శనతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో వర్గ విభేదాలు జాతీయ రహదారికి చేరాయి. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

MP Vijayasai Reddy Fires on MLA Sanjeevaiah Followers :సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకుల మధ్య భిన్నాభిప్రాయలున్న మాట వాస్తవమేనని విజయసాయిరెడ్డి అన్నారు. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా దూషణలకు దిగినా, దాడులకు దిగినా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. 

ABOUT THE AUTHOR

...view details