Class war in YCP: తాడేపల్లిలో వైసీపీ నేతల ఆధిపత్య ధోరణి.. పార్టీకి తలనొప్పి - AP Latest News
Clashes between YCP leaders: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య గొడవలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలోనే వైసీపీ నేతల మధ్య ఆధిపత్య ధోరణి ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధ్యక్షుడిగా వేమారెడ్డి దొంతిరెడ్డిని నియమించడాన్ని ఎమ్మెల్యే ఆళ్ల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పరస్పరం ఇరు వర్గాల మధ్య వాదులాటలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. పది రోజుల క్రితం తాడేపల్లిలోని కార్పొరేషన్ కార్యాలయంలోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగారు. తాజాగా గురువారం నులకపేటలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మరోసారి వైసీపీ నేతలు వాదులాటకు దిగారు. అధికారులు సమయానికి రాకపోవడంతో వేమారెడ్డి వర్గం నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీనిని పక్కనే ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వర్గం నేతలు తప్పుపట్టారు. అధికారులకు మద్దతు పలకడంతో ఇరు వర్గాల నేతలు కొట్టుకునే వరకు వచ్చారు. వెంటనే పార్టీ కార్యకర్తలు వచ్చి నేతలను పక్కకు లాక్కెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.