Video Viral: రోడ్లపై కత్తులతో యువకుల హల్చల్.. వీడియో వైరల్ - యువకుల మధ్య ఘర్షణ
Clash Between Youth : ఈ మధ్య కాలంలో యువత వివిధ అలవాట్లకు బానిసలుగా మారి ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతున్నారు. దీంతో కుటుంబంతో పాటు సమాజంలో నివసించే వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంజాయి, మద్యం లాంటి అలవాట్లతో కొంత మంది యువకులు తమ భవితవ్యాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలో యువకులు వీరంగం సృష్టించారు. బేతంచర్ల పట్టణంలో యువకులు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు, కత్తులతో హల్చల్ చేశారు. బేతంచర్ల పట్టణంలోని బలపాలపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో యువకులు కేకలు వేస్తూ అల్లర్లు సృష్టించారు. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లు విసురుకున్నారు. ఇది చూసిన స్థానికులు కాసేపు భయాందోళనకు గురయ్యారు. ఈ అల్లర్లు నాలుగు రోజుల క్రితం జరిగినా.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోను చూసి బేతంచర్ల పోలీసులు ఈ ఘర్షణకు గల కారణాలు, ఎవరెవరు పాల్గొన్నారో వారిని స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి :