ఏబీఎం సంస్థల ఆస్తుల వ్యవహారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ-కేసు నమోదు చేసిన పోలీసులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 1:36 PM IST
Clash Between Two Groups in Bapatla :బాపట్లలోని ఏబీఎం సంస్థల ఆస్తుల వ్యవహారంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏబీఎం పాఠశాల ఆవరణను శ్రుభ్రం చేస్తున్న సీబీజెడ్ చర్చి కమిటీ ప్రతినిధి క్రిస్టఫర్‌ని.. ఏబీఎం ఆస్తుల కస్టోడియన్ జాన్ ప్రసన్న బాబురావు వర్గీయులు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా యంత్రాలతో పాఠశాల మైదానంలోకి ఎలా వస్తారని క్రిస్టఫర్‌ను ఏబీఎం ఆస్తుల కస్టోడియన్ ప్రశ్నించారు. ఏబీఎం సంస్థ ఆస్తులపై ఇరువురికి హక్కులు ఉన్నాయంటూ.. క్రిస్టోఫర్ పేర్కొన్నారు.
Clash Between Two Groups in ABM Company Assets Issue : ఈ వాగ్వాదంలో క్రిస్టోఫర్‌పై జాన్ ప్రసన్న బాబురావు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో క్రిస్టోఫర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. జాన్ ప్రసన్న బాబురావుపై ఎదుటి వర్గం వారు దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘర్షణను నియంత్రించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు వర్గాలలోని క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. రెండు వర్గాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.