Class war in YCP: జగన్ కోసం కార్యకర్తలు సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి - MLA Ketireddy comments on Jagan
Class war in YCP: అనంతపురం జిల్లా ఎండనూరు మండలం దంతాలపల్లిలో ఉపాధి పనుల విషయంలో బుధవారం రాత్రి వైసీపీకి సంబంధించిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఒక వర్గానికి సంబంధించిన వారి మీద కేసులు నమోదు చేయడంతో.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎల్లనూరు పోలీసుస్టేషన్‌కి వెళ్లి.. ఇరు వర్గాల వారికి సమాన న్యాయం చేయాలని కోరారు. ఒక వర్గంపైనే వివక్ష చూపుతున్నారని అది అంత మంచిది కాదని అధికారులపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాజకీయ నేతలు పనులు చేయలేదని కక్షలు పెంచుకోవద్దంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పిలుపునిచ్చారు. జగన్ పార్టీ కోసం సర్వస్వం కోల్పోయి కార్యకర్తలు రోడ్డునపడ్డారు.. ఇలాంటి కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతే కాకుండా ఇక్కడ ఎంపీపీగా ఉన్న ఎస్సీ మహిళకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీలకు వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావట్లేదని ఆరోపించారు.