స్థలం కోసం కర్రలతో ఇరువర్గాల దాడి.. పలువురికి గాయాలు - Maremma temple site dispute
కర్నూలు జిల్లాలో రెండు వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇరవై ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న స్థలం కోసం పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు.సమాచారం తెలుసుకుని పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాల్లోకి వేళ్తే కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో మారెమ్మ గుడి స్థలం విషయంలో వివాదం రాజుకుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ చూసి గ్రామంలో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. చింతలగేని గేరిలో గతంలో మారెమ్మ గుడి ఉండేది. సుమారు 20 ఏళ్ల క్రితం మారెమ్మ గుడిని తొలగించి.. వేరే ప్రాంతంలో అలాంటి గుడినే నిర్మించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ స్థలం.. తమదంటే తమదంటూ.. రెండు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు దిగారు.. పరస్పరం కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు వచ్చి.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరు వర్గాలకు చెందిన 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు