Clap Vehicle labour Protest in Front of YCP Office వైసీపీ కార్యాలయం ఎదుట చెత్త తరలించే వాహనాలు.. వేతనాలు చెల్లించాలంటు కార్మికుల ఆందోళన - ఏపీ క్లాప్ డ్రైవర్స్ తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2023, 1:18 PM IST
Clap Vehicle Staff Protest in Front of YCP Office at Hindupuram :చెత్త సేకరణ క్లాప్ వాహనాల సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయం ఎదుట వాహనాలను ఆపి నిరసన వ్యక్తం చేశారు. హిందూపురం మున్సిపల్ పరిధిలోని చెత్త సేకరణ క్లాప్ వాహనాల సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించ లేదంటూ కార్మికులు విధులను బహిష్కరించి పట్టణంలో హారెన్లతో హోరెత్తిస్తూ ర్యాలీ (Sanitation Workers Rally) నిర్వహించారు. అంబేద్కర్ కూడలి వద్ద కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
అనంతరం వాహనాలను వైసీపీ కార్యాలయ ఎదుట ఆపి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. వాహనాలు మరమ్మతులకు చేయించకుండా షెడ్లో తోసేయని అధికారులు అంటున్నారని వారు ఆరోపించారు. ఆరు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదంటూ పలుమార్లు అధికారులు దృష్టికి రెడ్డి ఏజెన్సీ దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకపోవడంతో నిరసన బాట పట్టాల్సి వచ్చిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న రెడ్డి ఏజెన్సీపై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని లేకపోతే ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
TAGGED:
Sanitation Workers Rally