ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో క్లాప్ డ్రైవర్​ల ఆగ్రహం

ETV Bharat / videos

CLAP DRIVERS వ్యర్ధాల తరలింపు వాహన డ్రైవర్​లకు పూర్తి వేతనం చెల్లించాలి.. లేకుంటే

By

Published : May 3, 2023, 11:11 AM IST

చెత్త సేకరణ చేసే వాహనాల క్లాప్ డ్రైవర్​లకు లేబర్ కమిషనర్ ఆదేశాల ప్రకారం నిర్దేశించిన జీతం ఇవ్వకపోవడంతో వారు పోరాటానికి సిద్దమవుతున్నామని, మహా విశాఖ నగరపాలక సంస్ధ ఈ అంశాన్ని కౌన్సిల్ సమావేశంలో ఉంచకపోవడాన్ని కార్మిక సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. విశాఖలో  క్లాప్ డ్రైవర్​లకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 18,500 రూపాయల జీతం అమలు చేయాల్సి ఉండగా దానిని ఇవ్వకుండా వేధిస్తున్నారని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పీ.వెంకట రెడ్డి ఆరోపించారు. విశాఖలో మీడీయా సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే కార్మికులకు పూర్తి వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

దీనిపై పోరాటానికి సిద్దమయ్యామని, వివిధ రూపాలలో ఈ పోరాటం ఉంటుందని పీ.వెంకట రెడ్డి వెల్లడించారు. కార్మికులు అధికారులను ప్రశ్నిస్తున్నారని ఓ ఉన్నతాధికారి కార్మికుల్లో చీలిన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారనీ, ఇటువంటి చీప్ ట్రిక్స్​కు పాల్పడితే తీవ్రమైన పరినామాలు ఉంటాయని పీ.వెంకట రెడ్డి హెచ్చరించారు. మరో వైపు ఈ ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున కొందరు అధికారులు అనధికార మొత్తాలను వసూలు చేశారని చెత్త వాహనాలు క్లాప్ డ్రైవర్​లు ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details