Civil Judge Sudha Visited Chaitya Manovikasa Kendra : 'ప్రతి 8మందిలో ఒకరికి మానసిక రుగ్మత.. మనోధైర్యంతో వైకల్యాన్ని ఎదుర్కోవాలి' - బాపట్ల జిల్లా తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 3:37 PM IST
Civil Judge Sudha Visited Chaitya Manovikasa Kendra in Chirala : మనోధైర్యంతో వైకల్యాన్ని ఎదుర్కోవాలని, దీనికి తల్లిదండ్రుల సహకారం, ఓర్పు అవసరమని బాపట్ల జిల్లా చీరాల సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం.సుధ అన్నారు. అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చీరాలలోని చైత్య మనోవికాస కేంద్రంలో(దివ్యాంగుల పాఠశాల) న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా న్యాయమూర్తి సుధ పాల్గొన్నారు. వీల్ ఛైర్స్, రూ. 10 వేల నగదును చైతన్య మనోవికాస కేంద్రానికి.. న్యాయమూర్తి అందజేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి సుధ మాట్లాడతూ.. సేవా దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. మానసిక వైకల్యం ఉన్న చిన్నారులను చులకనగా చూడరాదని.. వారిపై ప్రేమ చూపించాలి అని అన్నారు. అందరూ చూడటానికి దృఢంగా ఉంటున్నారు. కానీ మానసికంగా చాలా మంది బాధపడుతున్నారని సుధ తెలిపారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని గణాంకాలు చెపుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.రమేష్ బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు.