ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CID_on_Chandrababu_Liquor_Case

ETV Bharat / videos

CID on Chandrababu Liquor Case: మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ.."అప్పటి వరకు అరెస్టు చేయమన్న సీఐడీ" - Chandrababu cases Details

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 4:41 PM IST

Updated : Oct 31, 2023, 6:59 PM IST

CID on Chandrababu Liquor Case :ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు (AP Skill Development Case)ల  మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనారోగ్య కారణాలతో హైకోర్డు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ తరుణంలో బెయిల్‌ ఇచ్చినందున మద్యం కేసులో చంద్రబాబు నాయుడును అరెస్టు చేయబోమని సీఐడీ.. హైకోర్టుకు నివేదించింది. మద్యం కేసు (Liquor Case)లో ముందస్తు బెయిల్‌ (Anticipatory Bail)  కోరుతూ చంద్రబాబు అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబు అత్యవసర పిటిషన్‌పై హైకోర్టుకో విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్‌ గడువు ముగిసే వరకు అరెస్టు చేయబోమని.. హైకోర్టుకు లిఖితపూర్వకంగా సీఐడీ అడ్వకేట్ జనరల్‌ హామీ ఇచ్చారు. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు నవంబరు 21కి వాయిదా వేసింది.

మద్యం కేసులో ముందస్తు బెయిల్‌ (Anticipatory Bail inLiquor Case) కోరుతూ చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై నేడు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. ఈకేసులో దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడును ఇరికించారని ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.  

Last Updated : Oct 31, 2023, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details