ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CI_Died_of_Heart_Attack_in_Nellore_District

ETV Bharat / videos

నెల్లూరు జిల్లాలో గుండెపోటుతో సీఐ మృతి - నివాళులర్పించిన మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 3:56 PM IST

CI Died of Heart Attack in Nellore District :గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వాళ్ల వరకు గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం సీఐ గొలగమూడి రామారావు గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం విధులకు హాజరైన సీఐ చాతిలో నొప్పి రావడంతో సిబ్బంది నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సీఐ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. పది నెలల క్రితం బుచ్చిరెడ్డిపాలెం సీఐగా బాధ్యతలు చేపట్టిన రామారావు, శాంతిభద్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేశారు.

సీఐ అకాల మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తోపాటు పలువురు సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు సీఐ పార్థివ దేహానికి నివాళులర్పించారు. పార్థివదేహాన్ని సీఐ స్వగ్రామమైన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామానికి తరలించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details