క్రైస్తవులను సీఎం జగన్ మోసం చేశారు - కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారు: క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ - క్రైస్తవుల ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 24, 2023, 4:05 PM IST
Christian Corporation Former Chairman Fire on CM Jagan: దళితుల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ గుంటూరులో 16 కోట్ల రూపాయలతో నిర్మించి దాదాపు 90 శాతం పూర్తైన క్రిస్టియన్ భవనాన్ని అర్ధాంతరంగా వదిలేశారని క్రైస్తవులు ఆందోళన చేశారు. దీంతో క్రిస్టియన్ భవనం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోందని క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మద్దిరాల మ్యానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం క్రిస్మస్ వేళకు కూడా క్రైస్తవ భవనాన్ని పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పక్షపాతినని చెప్తూనే సీఎం జగన్ క్రైస్తవులను మోసం చేశారని ధ్వజమెత్తారు.
"దళితుల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ క్రైస్తవులను మోసం చేశారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే క్రిస్టియన్లను వాడుకున్నారు. గుంటూరులో 16 కోట్ల రూపాయలతో నిర్మించి దాదాపు 90 శాతం పూర్తైన క్రిస్టియన్ భవనాన్ని అర్ధాంతరంగా వదిలేశారు. దీంతో ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోంది. కనీసం క్రిస్మస్ వేళకు కూడా క్రైస్తవ భవనాన్ని సీఎం జగన్ పట్టించుకోలేదు." - మద్దిరాల మ్యానీ, క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్