Chintakayala Ayyanna Patrudu: "వైసీపీ ప్రభుత్వం దేవుళ్లనీ దోచుకుంటోంది.. తిరుపతి హుండీ డబ్బుల్నీ వదలట్లేదు" - trhirumala news
Chintakayala Ayyanna Patrudu: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిధులను స్వాహా చేస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిననాటి నుంచి శ్రీవాణి ట్రస్ట్ పేరుత నిధులను మాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన వేలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రే అంగీకరించారని అయ్యన్న పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తిరుమల అంటే భక్తి నమ్మకం ఉంటుందని... స్వామి వారిపై భక్తితో ఇచ్చిన నిధులను సైతం దోచుకుంటున్నారని ఆరోపించారు. హుండీలో వేసిన డబ్బులను సైతం వదలడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు దోపిడి చేయవలసిన పరిస్థితి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరు పెట్టి టిక్కెట్ల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ సైజ్ను సైతం తగ్గించారని, ధరలు సైతం పెంచారని అయ్యన్న వెల్లడించారు. ఇప్పటికైనా దోపిడీని ఆపాలని సూచించారు. హిందూ దేవాలయాల్లో హిందువులను మాత్రమే ట్రస్ట్ మెంబర్లుగా పెట్టాలని అయ్యన్న డిమాండ్ చేశారు.