CM Jagan meeting with the IPAC team: 'ఏయే ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గింది..?' ఐప్యాక్ బృందంతో సీఎం భేటీ - సీఎం జగన్
CM meeting with the IPAC team: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహాలను అందిస్తోన్న ఐప్యాక్ టీమ్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో వైసీపీ ముఖ్య నేతలు, ఐప్యాక్ టీం ఇన్చార్జి రిషి రాజ్ సహా సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తాజా పరిస్థితిపై సీఎం విశ్లేషించారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోన్న తీరుపై సీఎం సమీక్షించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల భాగస్వామ్యం, పనితీరుపై చర్చించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఐ ప్యాక్ టీం నివేదికలు ఇవ్వగా.. వాటిపై సీఎం జగన్ చర్చించినట్లు తెలిసింది. నియోజక వర్గాల్లో గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు, స్థానిక పరిస్థితులపై సీఎం చర్చించారు. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు నెలకొన్న పరిస్థితుల్లో నియోజక వర్గ ఇన్చార్జీల మార్పు, నియామకాలపై చర్చించినట్లు తెలిసింది.