రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ ధ్వంసం - వెలువడుతున్న ఆవిరితో కళ్ల మంటలు - ఆవిరితో కళ్లు మంటలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 3:25 PM IST
Chemical Vapours Coming From Tanker: రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన ట్యాంకర్ నుంచి రసాయన ఆవిరి వెలువడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా జూపూడి వద్ద మంగళవారం అర్ధరాత్రి రసాయనాలతో వెళ్తున్న ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ పాక్షికంగా ధ్వంసం అవ్వటంతో డ్రైవర్ అక్కడే వదిలి పారిపోయాడు.
Eyes Burned Due to Suspicious Liquid Coming From Road Accident Tanker: బుధవారం ఉదయం ట్యాంకర్ను స్థానికులు గమనించి దాని వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ట్యాంకర్ నుంచి ఆవిరి రూపంలో లిక్విడ్ బయటికి వస్తూ రోడ్డు మొత్తం తడవడాన్ని గుర్తించారు. ఈ ఆవిరి ప్రభావంతో కళ్లు మండుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాహనానికి సంబంధించిన వారెవరూ అక్కడ లేకపోవడంతో ట్యాంకర్లో ఉన్న లిక్విడ్ ఎటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుందోనని ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రమాదంపై తక్షణమే అధికారులు స్పందించి లిక్విడ్ బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.