ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cheetah_in_ananthapur_district

ETV Bharat / videos

కంబదూరు మండలంలో చిరుత సంచారం! - కంబదూరులో తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 10:45 AM IST

Cheetah in Ananthapur District : అనంతపురం జిల్లా కంబదూరు మండలం మంద, కుర్లపల్లి గ్రామాలలో చిరుత సంచారంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. మంద, కుర్లపల్లి గ్రామాల నుంచి టమోటాల లోడ్​ తీసుకుని బొలెరో వాహనం వెళ్తుండటంతో చిరుత కనిపించింది. వాహనంలో ఉన్న రైతులు దానిని వీడియో తీసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Panther Roaming in Kanmbaduru :గ్రామాల సమీపంలో చిరుత సంచారంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తరుచూ తిరిగే ప్రాంతాలలో చిరుత కనబడటం పట్ల భయపడుతున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో చిరుతలు కనబడటం సాధరణమైపోతోంది. దుర్గంకొండలోని పొలాల్లో సంచరిస్తున్నచిరుతను రైతులు చూశారు. అటవీశాఖ వారికి సమాచారం ఇచ్చారు. దొడగట్ట- గోబనపల్లి గ్రామాల్లో సైతం రోడ్డుకు దగ్గరగా చిరుత సంచరించడంతో స్థానికులు భయపడుతున్నారు. జిల్లాలో చిరుతల సంచారంపై అటవీ అధికారులు చర్యలు చేపట్టాలని, పొలాలకు వెళ్లే రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details